టెస్ట్ క్రికెట్  అనేది క్రికెట్ ప్రారంభం నుంచి సంప్రదాయంగా ప్రేక్షకులను అలరిస్తున్న ఫార్మాట్. టెస్ట్ క్రికెట్ అనగానే దీర్ఘకాలం క్రీజులో నిలబడి ఆడే ఆటగాళ్ల టెక్నిక్, డిఫెన్స్ అన్నిటికంటే ముఖ్యంగా గంటలతరబడి ఆడే ఓర్పు గుర్తుకొస్తాయి. రోజులు మారుతున్నకొద్దీ ప్రేక్షకులను అలరించడానికి టెస్ట్ ఫార్మాట్ వన్డే, టీ 20లుగా రూపాంతరం చెంది ఆటగాళ్ల ఆటతీరు మారినట్లుగా ఆటగాళ్లు టెస్టులలో  కూడా ధాటిగా ఆడడం మనకు కనబడుతూనే ఉంది. 90 దశకంలో సిక్సర్లు అనేవి టెస్ట్ మ్యాచ్ లలో అరుదుగా వినబడే మాట కానీ ప్రస్తుతం  టెస్ట్ లలో కూడా ఎందరో ఆటగాళ్లు  సిక్సర్లు కొట్టి ప్రేక్షకులు కేరింతలు కొట్టేటట్లు  చేసినవారు వున్నారుఇందులో అత్యధిక సిక్సులు కొట్టి టెస్ట్ క్రికెట్ చరిత్రలో  టాప్ 10 జాబితాలో వున్నవారిని పరిశీలిద్దాం.


టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సులు కొట్టిన వారి టాప్ 10 జాబితా


1. బ్రెండన్ మెక్కల్లమ్

బ్రెండన్ మెక్కల్లమ్ టెస్టులలో 2004 నుంచి 2016 వరకు  న్యూజిలాండ్ కు  ప్రాతినిధ్యం వహించాడు. ప్రపంచ మేటి టెస్ట్ వికెట్ కీపర్ లలో బ్రెండన్ మెక్కల్లమ్ ఒకడు. ఇతడు టీ 20 లలో వన్డేలలో మాత్రమే కాదు టెస్టులలో కూడా బౌలర్లమీద సిక్సర్ల  దండయాత్ర చేసి ప్రేక్షకులకు వినోదం పంచేవాడుటెస్ట్ మ్యాచ్ లలో అత్యధిక సిక్సులు కొట్టిన వారి జాబితా లో బ్రెండన్ మెక్కల్లమ్ మొదటి స్థానంలో నిలిచాడు.
Image may contain: one or more people, people playing sport, baseball and outdoor

మ్యాచ్ లు         -     101
ఇన్నింగ్స్          -     176
సిక్స్ లు           -     107

2. ఆడమ్ గిలిక్రిస్ట్:

ఆడమ్ గిలిక్రిస్ట్ ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అటాకింగ్ బాట్సమెన్. ప్రపంచ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి వంద సిక్సులు కొట్టి రికార్డు సృష్టించినవాడుఖచ్చితంగా అంతర్జాతీయ క్రికెట్ లో గొప్ప కీపర్ అని రికార్డులు చెప్తున్నాయి. ఇతడు టెస్ట్ మ్యాచ్ లలో అత్యధిక సిక్సులు కొట్టిన వారి జాబితా లో బ్రెండన్ మెక్కల్లమ్ తర్వాత  రెండవ స్థానంలో నిలిచాడు.
Image may contain: 1 person, playing a sport and outdoor
మ్యాచ్ లు         -   96 
ఇన్నింగ్స్         -   137 
సిక్స్ లు          -   100   

3.క్రిస్ గేల్

వెస్ట్ ఇండీస్ విధ్వంసకర ఓపెనింగ్ బ్యాట్సమెన్ సిక్సుల గురించి తెలియని వారు ఎవరూ  ఉండరు.ఇతడు టెస్ట్ క్రికెట్లో రెండు ట్రిపుల్ సెంచరీలు చేసిన నలుగురిలో ఒకడు. ప్రతి బాల్ ని స్టేడియం బయటికి కొట్టగల ఆటగాడు. ఇతడు టెస్ట్ మ్యాచ్ లలో అత్యధిక సిక్సులు కొట్టిన వారి జాబితా లో క్రిస్ గేల్  మూడవ స్థానంలో నిలిచాడు.
Image may contain: 1 person
మ్యాచ్ లు         -    103
ఇన్నింగ్స్          -    182
సిక్స్ లు           -     98

4.జాక్వెస్ కలిస్:

జాక్వస్  కలిస్ సౌత్ ఆఫ్రికన్ ఆటగాడు. ప్రపంచ క్రికెట్ లో గొప్ప ఆల్ రౌండర్. టెస్టుల్లోనూ, వన్డేల్లోనూ, టి 20 ల్లోనూ దేనిలోనైనా జట్టులో ఉండాల్సిన ఆటగాడు. ఇతడు  గొప్ప బ్యాట్సమెన్, గొప్ప బౌలర్, గొప్ప ఫీల్డర్. క్రికెట్ లో ఇంతకంటే ఏం కావాలి ఒక ఆటగాడికి. ఇతడు టెస్ట్ మ్యాచ్ లలో అత్యధిక సిక్సులు కొట్టిన వారి జాబితా లో జాక్వస్  కలిస్ నాల్గవ స్థానంలో నిలిచాడు.
Image
మ్యాచ్ లు         -  166 
ఇన్నింగ్స్          -  280 
సిక్స్ లు           -   97   

5. వీరేంద్ర సెహ్వాగ్:

  ఇండియన్ డాషింగ్ ఓపెనర్ టెస్ట్ క్రికెట్లోనే ఒక కొత్త పంథా అనుసరించినవాడుభారత్ తరుపున టెస్టుల్లో  అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడుక్రికెట్ లో బౌలర్లను  బాదడమే నా  పని, బౌలర్ ఎవరన్నది నాకనవసరం.  అది స్కోర్ ఎంతన్నది ముఖ్యం కాదు బౌలర్ బాక్స్ బద్దలు కొట్టామా  లేదా అన్నదే ముఖ్యంక్రికెటర్లలో అత్యంత వినోదం పంచే ఆటగాడు. ఇతడు  బ్యాటింగ్ చేస్తున్నాడంటే టెస్టుల్లోనూ టి20 చూస్తున్నట్లు ఉంటుంది. టెస్ట్ మ్యాచ్ లలో అత్యధిక సిక్సులు కొట్టిన వారి జాబితా లో వీరేంద్ర సెహ్వాగ్  ఐదవ స్థానంలో నిలిచాడు.
Image may contain: 1 person
మ్యాచ్ లు         -      104
ఇన్నింగ్స్          -      180
సిక్స్ లు           -        91

6. బ్రియాన్ లారా:

వెస్ట్ ఇండీస్ క్రికెటర్ ప్రపంచ టెస్ట్ క్రికెట్ లో గొప్ప ఆటగాడు అని పిలువబడుతున్నవాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఒక ఇన్నింగ్స్ లో 400 పరుగులు చేసిన ఒకే ఒక్క ఆటగాడు. టెస్ట్ మ్యాచ్ లలో అత్యధిక సిక్సులు కొట్టిన వారి జాబితా లో బ్రియాన్ లారా  ఆరవ  స్థానంలో నిలిచాడు.
No photo description available.
మ్యాచ్ లు         -        131
ఇన్నింగ్స్          -        232
సిక్స్ లు           -          88

7. క్రిస్ కెయిన్స్ :

క్రిస్ కెయిన్స్ న్యూజిలాండ్ ఆల్  రౌండర్. టెస్టుల్లోనూ, వన్డేల్లోనూ 3000 పరుగులు, 200 వికెట్లు తీసిన కొంతమందిలో ఒకరు.  టెస్ట్ క్రికెట్లో ఇతడు రిటైర్డ్ అయ్యే సమయానికి అత్యధిక సిక్సులు కొట్టినవాడిగా ఉండేవాడు. అయితే ఇప్పుడు ఇతడు 7 స్థానంలో నిలిచాడు.

Chris Cairns
https://www.crictracker.com/wp-content/uploads/2014/12/Chris-Cairns-e1434187239386.jpg
మ్యాచ్ లు         -        62
ఇన్నింగ్స్         -        104
సిక్స్ లు           -         87

8.వివ్ రిచర్డ్స్:

వివ్ రిచర్డ్స్ ప్రపంచ క్రికెట్ కు 70,80 దశకాలలోనే దూకుడును  పరిచయం చేసిన వ్యక్తి. నత్తనడకన సాగే సహాచరుల బ్యాటింగ్  నుంచి   ఇతడు ప్రత్యేకం. అప్పట్లోనే బౌలర్లను చీల్చిచెండాడి ప్రేక్షకులకు వినోదాన్ని పంచేవాడు. టెస్ట్ మ్యాచ్ లలో అత్యధిక సిక్సులు కొట్టిన వారి జాబితా లో వివ్ రిచర్డ్స్   ఎనిమిదవ స్థానంలో నిలిచాడు.
Image
మ్యాచ్ లు         -        121
ఇన్నింగ్స్         -        182
సిక్స్ లు           -         84

9. ఆండ్రూ ఫ్లింటాఫ్ :

ఆండ్రూ ఫ్లింటాఫ్ 1998 నుంచి 2009 వరకు ఇంగ్లండ్ కు ప్రాతినిధ్యం వహించాడు. ఇతడు ఇంగ్లాండ్ మాజీ ఆల్ రౌండర్ మంచి పవర్ హిట్టర్. టెస్ట్ మ్యాచ్ లలో అత్యధిక సిక్సులు కొట్టిన వారి జాబితా లో ఫ్లింటాఫ్   తొమ్మిదవ స్థానంలో నిలిచాడు.
Image may contain: 1 person
మ్యాచ్ లు         -       79
ఇన్నింగ్స్         -       130
సిక్స్ లు           -        82


10.మాథ్యూ హేడెన్:

ఆసీస్ మాజీ ఓపెనింగ్ బాట్స్మన్ ప్రపంచ క్రికెట్లో గొప్ప ఓపెనింగ్ బ్యాట్సమెన్. టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు చేసిన వారిలో 380 పరుగులతో 2 స్థానంలో వున్నాడు అగ్రసివ్ బ్యాట్సమన్ టెస్ట్  మ్యాచ్ లలో అత్యధిక సిక్సులు కొట్టిన వారి జాబితా లో   పదవ  స్థానంలో నిలిచాడు.


మ్యాచ్ లు         -        103
ఇన్నింగ్స్         -        184
సిక్స్ లు           -         82

వన్డే క్రికెట్లో అత్యధిక సిక్సులు కొట్టినవారి టాప్ 10 జాబితను  క్రింద ఇచ్చిన లింక్ లో చూడగలరు. 
మీ అభిప్రాయాలను మాకు తెలియజేయగలరు.