దెయ్యాలు భూతాలు ప్రేతాత్మలు ఉన్నాయా? Are the ghosts Real,

నిజంగా దెయ్యాలు, భూతాలు ప్రేతాత్మలు ఉన్నాయా? దెయ్యాలు అనగానే అర్ధరాత్రి  చిమ్మ చీకటి, ఆవురావురుమంటు శవాలకోసం అరుస్తున్న  ఆకలితోకూడిన  నక్కల అరుపులు, భయంతో వణికించే గుడ్లగూబ కళ్ళు   ఘల్లుఘల్లుమని వినిపించే విచిత్రమైన సంగీత శబ్దాలు కలలో ఊహించడానికికూడా భయపడే జుట్టు విరబోసుకుని పాదాలు వెనక్కి వుండే స్త్రీ రూపాలు, ఎవరో మనల్ని వెంబడిస్తున్నట్లనిపించే వెనిక్కి తిరిగి చూస్తే ఎవరు కనబడని దృశ్యాలు మన కళ్ళముందు మెదిలాడుతే అయ్యో దెయ్యం అంటూ వణుకు బెణుకు పుట్టి కంటికి కునుకు లేని రాత్రులు గడుపడంతో దెబ్బకు దేవుడు గుర్తుకొస్తాడు. చిన్న పిల్లలనుంచి పండు ముసలోళ్లవరకు దెయ్యాల ప్రస్తావన వస్తే  అయ్యో దెయ్యాలా అని  పట్టపగలు కూడా దిగాలు పడి దెబ్బకు చలి జ్వరం వచ్చినంత పని అవుతుంది. దెయ్యాలు లేవు భూతాలు లేవు అది వట్టి భ్రమ మాత్రమే అని  ధైర్యంగా కొట్టిపారేసేవారు  లేకపోలేదు అటువంటి ధైర్యశాలులు, కండలు తిరిగినవారుకూడా రాత్రిపూట  దెయ్యం అనేమాట వినగానే దేవుడ్ని తలచుకుంటారు.
  

                              source    te.wikipedia.org 
దెయ్యాలు అనగానే సాధారణంగా దేవునికి విరోధమైనవి లేదా దేవునికి వ్యతిరేకమైన క్రియలు జరిగించేది అనే అర్ధం వస్తుంది. ఎలాగయితే మంచి, చెడు రెండూ ఈ లోకంలో ఉన్నాయో అలాగే దేవుడ్ని నమ్మే ప్రతి ఒక్కరు దేవుడు లోకానికి మంచి చేసేవాడుగాను దెయ్యం చెడు జరిగించేదిగాను మానవ నాశనాన్ని కోరుకునేదిగాను ఉందని నమ్ముతూ వుంటారు. మనుష్యుల కోరికలు తీరకుండా చనిపోయినప్పుడో  లేదా శత్రువులు వారిని హింసించి చంపినప్పుడో (హత్య), ఆత్మహత్యలు చేసుకున్నప్పుడో వారిలోని ఆత్మలు తమ కోరికలు తీర్చుకోవడానికి లేదా వారి శత్రువులను చంపడానికి  భూతం, ప్రేతం రూపంలోకి మారి  స్మశానాలలోను, పాడుబడిన బావుల్లోనూ, పాత భవనాల్లోనూ తిరుగుతూ అవి  పగ తీర్చుకున్న తరువాత అంతం అవుతాయని అనడం వింటూ ఉంటాము. 

కోరికలు తీరక చనిపోయిన వ్యక్తులు నిజంగా భూతాలుగా మారుతారా? ఏదోఒకరోజు ప్రతి ఒక్కరు చనిపోవాల్సిందే. ఎవరైనా ఒకవ్యక్తి  చనిపోయిన తరువాత తన ఆత్మను అడిగితే అది ఏమంటుంది. అది నా  కోరికలు తీరాయి అంటుందా! ఒక మనిషి కోరికలన్ని తీరడం అనేది ఖచ్చితంగా అసాధ్యం. ఒకవేళ మనం గ్రుడ్డిగా నమ్మినట్లయితే ఫర్వాలేదు. ఏమాత్రం కొద్దిగా ఇంకితజ్ఞానం ఉపయోగించినా మనకు అర్ధమయ్యే విషయం ఏంటంటే  ఏ మానవుడు  కోరికలు అన్ని తీరాయి ఇక నేను చనిపోవడానికి సిద్ధం అని చెప్పడు ఎందుకంటే తాను ఇంకా బ్రతకాలనే కోరిక అతడి నరనరాల్లో ఎప్పటికీ  ఉంటుంది. దీనినిబట్టి ఏ మానవుడు పూర్తి కోరికలు తీరడం జరుగదు కాబట్టి బ్రతికున్న మనుష్యులందరికంటే మరణించి దెయ్యాలుగా మారినవారే ఈ ప్రపంచంలో అత్యధికంగా ఉండాలి. దీనినిబట్టి అర్ధమయ్యేది ఏంటయ్యా అంటే ఇది ముమ్మాటికీ అబద్దం అని. 

ఆత్మహత్య అనేది నేరం ఘోరం. దేవుడు బ్రతకడానికి ఇచ్చిన విలువైన  జీవితాన్ని అన్యాయంగా,అనాలోచితమైన నిర్ణయాలతో అనవసరమైన వాటికొరకు త్యాగంచేసి అర్ధాంతరంగా వారి జీవితాలను ఆర్పివేస్తున్నారు. ఆస్పత్రులలో చూసినట్లయితే పండు ముసలి వాళ్ళు కూడా బ్రతకడానికి చేసే ఆరాటం, పోరాటం చూస్తే బ్రతకాలన్న తపన  ప్రాణం విలువ ఎటువంటిదో అర్ధం అవుతుంది.  దేవుడు ఇచ్చిన అంతటి విలువైన ప్రాణాన్ని బలవంతంగా తీసుకునే వారు దెయ్యాలు, భూతాలుగా మారతారనడం మూఢనమ్మకమే  అవుతుంది. మనకు దేవుడి యొద్దనుండి వచ్చిన ప్రాణం మరణించిన తరువాత తిరిగి దేవునియొద్దకు వెళ్తుంది. 

కాబట్టి నా ఉద్దేశ్యం ప్రకారం దెయ్యాలు వున్నాయి కానీ అవి  మనము అనుకున్నట్లు విచిత్రమైన జుట్టు, వస్త్రాధారణతో భయంకరమైన రూపంతో వుండవు. వాటికసలు రూపమే ఉండదు. అవి కనపడవు కానీ మనుష్యులను చెడు చేయడానికి ప్రేరేపిస్తూ దేవునియొద్దనుండి మనల్ని దూరం చేసి తాను వెళ్లాల్సిన నరకం అనేచోటికి తీసుకెళ్లాలని ఆరాటపడుతుంటాయి. దీనినిబట్టి అర్ధమయ్యేది ఏంటయ్యా అంటే దెయ్యాలు అనే వాటి గురించి ఆలోచించడం అనవసరం. 

ధన్యవాదాలు 
మీ అభిప్రాయాలు కామెంట్లరూపంలో తెలియజేయగలరు 

Post a Comment

0 Comments