Telugu News
కరోనా కేసులే లేని దేశాలు ఉన్నాయా? is there Corona free countries
కరోనా... ప్రశాంతంగా వున్న ప్రపంచంలోకి జొరబడి మానవాళి జీవితాల్లోకి చొచ్చుకుపోయి అల్లకల్లోలం కలుగచేసి ధనిక పేద అన్న భేధభావం, పెద్ద చిన్న అన్న కనికరం ఏమాత్రం లేకుండా ప్రపంచాన్నే వణికిస్తూ ప్రతి ఒక్కరి దృష్టి తనమీదే ఉంచుకుని తన కౄరత్వంతో మనుష్యుల జీవన విధానాన్నే మార్చి అడుగు దూరం నిలబడే ఆచారాన్ని మన జీవితాలకు అంటకట్టిన కరోనా అంటేనే ప్రపంచానికి కాలయముడిలా కనిపిస్తూ కంటతడి పెట్టిస్తూ వస్తుంది. ఇటువంటి కరోనా, అభివృద్ధి చెందాము అని చెప్పుకునే అమెరికా రష్యానుకూడా విడిచిపెట్టక అల్లాడిస్తూ కంటిమీద కునుకు లేకుండా చేసి కల్లాకపటం తెలియనివారినికూడా కబళిస్తూ లాక్ డౌన్లు, షట్ డౌన్లు లెక్కచేయక దినదినము తన వ్యాప్తిని విస్తరిస్తూ విరుగుడే లేని తిరుగులేని వైరస్ గా విర్రవీగుతూ మనుష్యుల జీవితాలతో మమేకమైపోయింది.
ముఖ్యంగా మన భారతదేశంలో అయితే ప్రభుత్వాలు, అధికారులు ఆరంభంలో లాక్ డౌన్ వలన కరోనా అదుపులో ఉన్నదని చెప్పుకున్నప్పటికీ లాక్ డౌన్ సడలించిన తరువాత చేయిదాటిపోయిందని చేతులెత్తేసి చేయగలిగిందేదీ లేదని చెప్పుకుంటూ తిరగడం మనం చూస్తూనే వున్నాము. భారతదేశ పరిస్థితి ఇలా ఉంటే కొన్ని దేశాలు మాత్రం ముందుచూపుతో పగడ్బందీగా తీసుకున్న చర్యలవలన ఎటువంటి కరోనా భీతి లేకుండా ధైర్యంగా సాధారణ జీవితాన్ని కొనసాగిస్తూ కరోనా కేసులే లేని దేశాలుగా నిలబడి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచాయి.
source -who
ప్రపంచమంతా కరోనాతో తల్లడిల్లుతుంటే పైన చెప్పబడిన దేశాలు మాత్రం సాధారణ జీవితాన్ని గడుపుతున్నాయి. మన భారతదేశంకూడా కరోనా లేని దేశంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ధన్యవాదాలు.
మీ అభిప్రాయాలు కామెంట్ల రూపంలో తెలియజేయగలరు.
ముఖ్యంగా మన భారతదేశంలో అయితే ప్రభుత్వాలు, అధికారులు ఆరంభంలో లాక్ డౌన్ వలన కరోనా అదుపులో ఉన్నదని చెప్పుకున్నప్పటికీ లాక్ డౌన్ సడలించిన తరువాత చేయిదాటిపోయిందని చేతులెత్తేసి చేయగలిగిందేదీ లేదని చెప్పుకుంటూ తిరగడం మనం చూస్తూనే వున్నాము. భారతదేశ పరిస్థితి ఇలా ఉంటే కొన్ని దేశాలు మాత్రం ముందుచూపుతో పగడ్బందీగా తీసుకున్న చర్యలవలన ఎటువంటి కరోనా భీతి లేకుండా ధైర్యంగా సాధారణ జీవితాన్ని కొనసాగిస్తూ కరోనా కేసులే లేని దేశాలుగా నిలబడి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచాయి.
source -who
కరోనా కేసులే లేని దేశాలు:
1. నార్త్ కొరియా
నార్త్ కొరియా తూర్పు ఆసియా దేశం. కింగ్ జాంగ్ ఉన్ దుందుడుకు నిర్ణయాలవలనో ఆవేశపూరిత అనాలోచిత కఠిన చట్టాలద్వారానో ప్రతి ఒక్కరికి నార్త్ కొరియా పరిచయమే. 2018 లెక్కల ప్రకారం 2.55 కోట్ల జనాభా కల్గిన దేశంలో ముందు జాగ్రత్త పడి జనవరిలోనే నార్త్ కొరియా వారు సరిహద్దులను మూసివేయడంతో ఇప్పటికి కరోనా కేసులే నమోదు కాలేదని గర్వంగా ప్రకటించారు. ఒకవైపు చైనా, మరోవైపు దక్షిణ కొరియా సరిహద్దులున్న ఉత్తర కొరియా కరోనా కేసులే లేవని ప్రకటించడంతో ప్రపంచంలో అనేకమంది నిపుణులుమాత్రం ఈ ప్రకటనని నమ్మలేకపోతున్నారు.
2. తుర్క్ మెనిస్థాన్
తుర్క్ మెనిస్థాన్ మధ్య ఆసియా దేశం. 2018 లెక్కలప్రకారం 58.5 లక్షలు జనాభా కలిగిన ఈ దేశంలో కరోనాతో ప్రపంచం మొత్తం అతలాకుతలమవుతున్నా తమ దేశంలో ఎటువంటి కరోనా కేసులు లేవని తుర్క్మెనిస్తాన్ ప్రకటించింది. కరోనా వ్యాపిస్తున్న తరుణంలో మొదటిసారి జనవరి 31 న బ్యాంకాక్, బీజింగ్‌కు విమాన సేవలను రద్దు చేసింది. ఆ తరువాత ఫిభ్రవరి 29 నుంచి విదేశీ ప్రయాణీకులను తమ దేశంలోకి అనుమతించలేదు. ఈ విధంగా చర్యలు తీసుకోవడంతో ప్రస్తుతానికి తమ దేశంలో ఎటువంటి కరోనా కేసులు లేవని ప్రకటించడంతో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని కొంతమంది గగ్గోలు పెడుతున్నారు.
3. సోలమన్ ద్వీపాలు(solomon islands)
సోలమన్ ద్వీపాలు అనేవి 6 పెద్ద ద్వీపాలు, 900 చిన్న చిన్న ద్వీపాల సమూహం. ఇందులో 2018 జనాభా లెక్కల ప్రకారం 6.53 లక్షల జనాభా కలిగి వుంది. ఈ ద్వీపాలలో ప్రపంచంలోనే అతి తక్కువమంది యాత్రికులు పర్యటిస్తారు. అందువలనే ఇక్కడ కరోనా వ్యాపించకుండా ఉండడానికి తోడ్పడింది. ఇప్పటికి ఈ ద్వీపాలలో ఒక్క కరోనా కేసుకూడా నమోదు కాలేదని ప్రకటించింది.
4. వనువాటు (Vanuatu)
వనువాటు లేదా వనాటు అనే దేశం దక్షిణ పసిఫిక్ సముద్రంలోని 80 ద్వీపాల సమూహం. కేవలం 2.93 లక్షలు జనాభా ఉన్న ఈ దేశం పూర్తిగా పర్యాటకంమీద ఆధారపడిన దేశం. కరోనా కేసులు వున్న దేశాల ప్రజలను అనుమతించకపోవడం, ఒకవేళ ఎవరైనా పర్యాటకులు ఈ దేశంలో అడుగుపెట్టాలంటే 14 రోజులు క్వారంటైన్ లో ఉండడం అలాగే మెడికల్ సర్టిఫికెట్ చూపించిన వారిని మాత్రమే అనుమతించడంవంటి నిర్ణయాలు తీసుకోవడంతో ఆ దేశంలో ఇప్పటికి ఒక్క కరోనా కేసుకూడా నమోదు కాలేదని ఆరోగ్యశాఖ ప్రకటించింది.
5. సమావో(Samoa)
1.96 లక్షల జనాభా కల్గిన సమావో ద్వీపాలు . ప్రపంచం మొత్తం కరోనా విలయతాండవం చేస్తుండగా ఇక్కడ ఒక్క కేసుకూడా నమోదు కాకపోవడం ఆశ్చర్యకరం. మొదట ఫిభ్రవరి 22న క్రూజ్ షిప్ లను నిషేధించారు. విమాన సేవలను మార్చి 2 న ఆపివేసి, మార్చి 26 న లాక్ డౌన్ విధించడంతో ఆ దేశంలో కరోనా కేసులు లేని అతి కొద్ది దేశాలలో ఒకటిగా నిలిచింది.
6. కిరిబాతి (Kiribathi)
కిరిబాతి 1. లక్షల జనాభా కలిగిన మధ్య పసిఫిక్ దేశం. ఈ చిన్న దేశ ప్రభుత్వం ఫిభ్రవరి 1 న చైనా దేశ వీసాలను రద్దు చేసింది. ఒకవేళ ఇతర దేశాలనుంచి వచ్చే వారు క్వారంటైన్ లో ఉండాలన్న నిబంధన తీసుకొచ్చింది. మార్చి 28న దేశంలో అత్యవసర పరిస్థితిని తీసుకువచ్చింది. దీంతో ఈ చిన్న దేశం కరోనా కేసులే లేని దేశంగా నిలిచింది.
7. మైక్రోనేషియా(Micronesia)
పశ్చిమ పసిఫిక్ లోని 600 పైగా వున్న ద్వీపాల సమూహం. ఇందులో 1.13 లక్షల జనాభా నివసిస్తున్నారు. ఫిభ్రవరి 3 న మైక్రోనేషియా ప్రభుత్వం తన దేశ ప్రజలు చైనా మరియు ఇతర కరోనా వున్న దేశాలకు ప్రయాణించకుండా నిషేధించింది. కరోనా కారణంగా మార్చి 15 న అన్ని దేశాల ప్రయాణికులను మైక్రోనేషియా దేశానికి రాకుండా పూర్తి నిషేధం విధించింది. దీంతో ఇప్పటివరకు ఒక్క కేసుకూడా లేని దేశంగా నిలిచింది.
8. టోంగా (Tonga)
దక్షిణ పసిఫిక్ లోని 170 ద్వీపాల సమూహం. 2018 లెక్కల ప్రకారం 1.03 లక్షల జనాభా వున్నది. టోంగా ప్రభుత్వం మొదటిసారి 29 మార్చి నుంచి ఏప్రిల్ 5 వరకు లాక్ డౌన్ విధించింది. దీంతోపాటు క్రూజ్ ఓడలమీద అనేక నిబంధనలు పెట్టడంతో ఆ దేశంలో ఇప్పటికి ఎటువంటి కరోనా కేసులు నమోదు కాలేదని ప్రకటించింది.
9. ది మార్షల్ ద్వీపాలు(The Marshall Islands)
మార్షల్ ద్వీపాలు అనేవి మధ్య పసిఫిక్ మహాసముద్రంలోని 58,413 మంది జనాభా కలిగిన దేశం. జనవరి 24వ తేదీనుంచి వారి దేశానికి వచ్చే వారు 14 రోజులు క్వారంటైన్ లో ఉండాలన్న ఆదేశాలను జారీ చేసింది. దాని తరువాత మార్చి 1నుంచి చైనా, హాంకాంగ్, సౌత్ కొరియా, జపాన్, ఇటలీ, ఇరాన్ లాంటి దేశాలనుంచి ఎవరిని అనుమతించకుండా నిషేధించడంలాంటి నిర్ణయాలద్వారా వారి దేశంలో కరోనా కేసులే లేకుండా చేసింది.
10. పలావు(Palau)
పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో 500 కు పైగా ఉన్న ద్వీపాల సమూహం. ఈ ద్వీపాలలో కేవలం 18,000 మంది జనాభా మాత్రమే నివసిస్తున్నారు. ఫిభ్రవరి 1 నుంచి 29 వరకు చైనా, హాంకాంగ్ లాంటి దేశాలనుంచి విమానాలను ఆ దేశ అధ్యక్షుడు నిషేధించాడు. ప్రస్తుతానికి ఈ దేశంలో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు.
11. తువాలు (Tuvalu)
దక్షిణ పసిఫిక్ సముద్రంలోని 9 ద్వీపాలు కలిసి తువాలు దేశంగా పిలుస్తారు. కేవలం 11,508 మంది మంది మాత్రమే నివసిస్తారు. ప్రపంచంలోనే అతి తక్కువ మంది ప్రయాణించే దేశాలలో తువాలు ఒకటి కావడంతో అలాగే ఏప్రిల్ 3 నుంచి ఆ దేశంలోకి ప్రయాణించే వారు 14 రోజులు క్వారంటైన్ లో ఉండాలనే నిబంధన ఉండడంతో ఈ దేశంలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.
12. నౌరు(Nauru)
మధ్య పసిఫిక్ మహా సముద్రంలోని అతి చిన్న ద్వీపం. దీనిలో 2018 లెక్కల ప్రకారం 12,704 మంది జనాభామాత్రమే వుంటున్నారు. ఈ దేశంలోకూడా ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.
ధన్యవాదాలు.
మీ అభిప్రాయాలు కామెంట్ల రూపంలో తెలియజేయగలరు.
Post a Comment
0 Comments