కరోనాను ఎదుర్కోవడం ఎలా, How to Protect from Corona virus in telugu

ఎన్నో వస్తువులు చైనా లో తయారయ్యి అనేక దేశాలకు ఎగుమతి అయ్యినట్లుగా కరోనా కూడా చైనాలో పుట్టి చైనానుంచి  చక చకా చెక్కేసి విమానం ఎక్కేసి ప్రపంచం మొత్తం చుట్టేసి 
అన్నీ దేశాలను కమ్మేసి అస్తవ్యస్తంగా అమానుషంగాను  మార్చేసి ఆర్ధికంగా అతలాకుతలం చేసి ఆకలితో  అలమటించేలా మానవ జీవితాలను మంటకలిపి   మనుష్యులను మట్టు పెట్టడమే నా లక్ష్యం అన్నట్లుగా వీధుల్లో తిరగనీకుండా నిర్మానుష్యంగా మార్చేసి ప్రభుత్వ కఠిన నిర్ణయాలను ఖాతరు చేయకుండా వీరుడని నిర్లక్ష్యంతో విర్రవీగుతూ తిరిగినవారి నిండుప్రాణాలు నిర్దాక్షిణ్యంగా తీస్తూ ఉంటే నిజంగా ప్రాణంమీద తీపి ఉన్నవాడు ప్రాణాలెలా కాపాడుకోవాలో తెలియక కకావికలం అవుతూ కలత చెందుతూ వున్నాడు. కలలోకూడా ఊహించని కష్టం కళ్ళముందు కనబడుతూ ఉంటే ఏమి చేయాలో పాలుపోని వాళ్లలో మనమూ వున్నాము.


                                          BBC.Com  
రోనా వైరస్ కు మందు లేదు నివారణ ఒక్కటే మార్గం అని  ప్రభుత్వాలు, మీడియా కోడై కూస్తుంటే కూసంత కూడా భయం లేక ప్రాణాలు గాలిలో పెట్టిన దీపాల్లా ఆరిపోతున్నా ఎవరికి పట్టడం లేదు. కాబట్టి ఇకనైనా నిర్లక్ష్యం విడిచి ప్రభుత్వాలమీద నిందలు మాని నిజమైన భారతీయుడిలా సమాజానికి మేలు చేసే వ్యక్తిగా కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే మనతోపాటు ఇతరులను రక్షించిన వారముగాను సమాజానికి మేలు చేసిన వారముగాను ఉంటాము.  ఆ తీసుకోవాల్సిన జాగ్రత్తలేవో చూద్దాము. కరోనాకు మందు లేదు కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటించి దానినుంచి మనం తప్పించుకోవచ్చు. 




కరోనాను ఎదుర్కోవడానికి పాటించాల్సిన జాగ్రత్తలు:


* ముఖ్యంగా జనాభా అధికంగా తిరిగే రద్దీ స్థలాలలో సంచరించకుండా ఉండడం ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో  వెళ్లినా ఒక మీటరు భౌతిక అంతరం పాటించడంద్వారా కరోనా సోకకుండా జాగ్రత్త పడగలము. ఉదా: మార్కెట్, కార్యాలయాలు [Office].    

*కరోనా గాలిలో ప్రయాణిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించడంతో కరోనా ఇంకా ఉగ్రరూపందాల్చే అవకాశముండడంతో బయటికి వెళ్ళేటప్పుడు తప్పక మాస్క్ ధరించడంద్వారా ఇతరులు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు  గాలిలోకి వ్యాప్తి చెందే వైరస్ ను మన శరీరంలోకి ప్రవేశించకుండా మనము ఆపగలము. అలాగే మాస్క్ ని ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉండాలి.  

* చేతులకు గ్లౌస్ వేసుకోవడం, తరచుగా మన చేతులను హ్యాండ్ వాష్ లిక్విడ్ ద్వారా 20 సెకండ్లుపాటు కడగడం, అలాగే  శానిటైజర్ ఉపయోగించడంద్వారాను మన చేతులకు అంటుకుని ఉన్న వైరస్ చనిపోతుంది. కానీ శానిటైజర్ అధికంగా ఉపయోగించడం ద్వారా దుష్ప్రభావాలు[Side Effects] జరిగే ప్రమాదం ఉండడంతో వీలైనంతగా శానిటైజర్ వాడకం తగ్గించి హ్యాండ్ వాష్ లిక్విడ్ అధికంగా ఉపయోగించాలి. 

* కరోనా వైరస్ నోరు, ముక్కు, కళ్ళు ఇతర గాయాల ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది గనుక వీలైనంతగా మన చేతులను కళ్ళు, ముక్కు,కళ్ళను ముట్టకుండా జాగ్రత్తపడాలి. చేతులను శుభ్రంగా కడిగిన తర్వాతే వాటిని ముట్టనివ్వాలి. 

* మన ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. ఉప్పు, చక్కెర, కొవ్వు అధికంగా వుండే ఆహార పదార్థాల్ని కాస్త దూరం ఉంచడం మంచిది. ప్రతి రోజు వివిధ రకాల మంచి పోష్టికాహారాన్ని ముఖ్యంగా విటమిన్ సి ఉండే జామ,నిమ్మ, బత్తాయి, ఆరెంజ్, బొప్పాయి, కివి ఫ్రూట్, వంటివి శుభ్రపరిచి తీసుకోవాలి. దాని ద్వారా మన శరీరంలోని రోగ నిరోధకశక్తిఅధికమవ్వడంతో మన శరీరంలోకి ప్రవేశించకుండా వైరస్ ను నిరోధించగలము.

శక్తినిచ్చే మంచి పౌష్టిక ఆహారాన్ని మితంగాను వేడిగా తీసుకోవాలి. వీలైనంతగా హోటల్ భోజనాలకి దూరంగా ఉండాలి.  కాచి చల్లార్చిన[Warm Water] వెచ్చని నీరు ఒక రోజుకి  సుమారుగా 8 నుంచి 10 గ్లాసులు త్రాగాలి ఇలా  తీసుకోవడంద్వారా మన శరీరంలోని వ్యర్ధాలు మూత్రంద్వారా విసర్జించగలుగుతాము. 

* ప్రతి దినం వ్యాయామాలు చేయడం ముఖ్యంగా  శ్వాస సంబంధమైనవి, శారీరక సంబంధమైనవి చేయడం ద్వారా మన కండరాలు బలపర్చబడి , గుండె పనితీరు మెరుగుపడుతుంది. అలాగే ఊపిరితిత్తులు ఆక్సిజన్ ను అధికంగా తీసుకోవడం వలన శ్వాస సంబంధ రోగాలనుంచి ఉపశమనం కలుగుతుంది. 

*శొంఠి, మిరియాల పొడి, పసుపు, మొగ్గ వంటివి ఉపయోగించి చేసేటటువంటి కషాయాలకు కాస్త నిమ్మరసం కలుపుకుని  ఇంటి వద్ద తయారుచేసుకుని ఉదయం, సాయంత్రం ప్రతిరోజు తీసుకోవడంద్వారా జలుబు దగ్గు వంటి వాటినుంచి ఉపశమనం లభిస్తుంది.  

* ఉదయం సాయంత్రం steam pills ద్వారా ఆవిరి పట్టడంద్వారా ముక్కుద్వారంలోని వ్యర్ధాలు తొలగింపబడి శుభ్రపరచబడి శ్వాస తీసుకోవడం సులభమవుతుంది. దీనిద్వారా ఊపిరి పీల్చుకోవడం సులభమవ్వుతుంది.  

*  ముఖ్యంగా దగ్గు, జ్వరం, జలుబు, ఆయాసంవంటివి వున్న వారికి దూరంగా ఉండడం. అలాగే మనకు ఉన్నట్లయితే వెంటనే ఇతరులకు దూరంగా ఉండి టెస్ట్ చేయించుకుని వైద్యుల సహాయం కోరాలి.      

పై విధంగా జాగ్రత్తలు పాటించడం ద్వారా కరోనా వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోగలం, ఇతరులను కాపాడగలం. నిర్లక్ష్యం వహించడంతో నిండుప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి నిర్లక్ష్యాన్ని విడుద్దాం,నిండు ప్రాణాల్ని కాపాడుకుందాం.

ధన్యవాదాలు 
కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయగలరు.   

Post a Comment

0 Comments