Telugu News
ప్రపంచ ధనవంతుల జాబితా, Richest People in the world for 2020,
ధనవంతులు కావాలన్న కోరిక ప్రతి ఒక్కరికి ఉండే ఉంటుంది. కానీ పేదరికం, బీదరికం అనే అవరోధాలను అధిరోహించి అవమానాలు అనే అడ్డంకులను దాటుకుంటూ దానిని సాధించి చేధించడమే కఠినమైన సవాలు. కోరికతోపాటు సాధించాలన్న తపన, కసి పట్టుదల కలిసి మంచి కార్యాచరణతో ఎందరో తమ కలను నెరవేర్చుకుని అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యం చేసి ఆదర్శంగా నిలిచినవారు ఎందరో వున్నారు. అటువంటివారిలో కొందరు తమ పితరుల ఆస్తిపాస్తులను వారసత్వంగా పొంది వాటిని హెచ్చించుకుంటూ వెళ్లి కుభేరులుగా మారి ఆడంబరమైన, సుఖభోగమైన జీవితాన్ని జీవిస్తుంటే మరి కొందరు స్వయంకృషితో కఠిక పేదరికంనుంచి వినూత్న ఆలోచనలతో కొత్త, కొత్త సంస్థలను స్థాపించి, టెక్నాలజీ ద్వారాను, వ్యాపారాల ద్వారాను సంపాదిస్తూ అంచెలంచెలుగా ఎదిగి ధనవంతులుగా మారినవారు వున్నారు. ఆవిధంగా ధనవంతులుగా మారి ప్రపంచ ధనవంతులలోనే మొదటి పది స్థానాలలో నిలిచిన వారి వివరాలు బ్లూమ్బర్గ్ అనే సంస్థ 2020 జులై కిగాను ప్రకటించింది ఆ వివరాలు చూద్దాము.
జెఫ్ బెజోస్ ప్రపంచ కుభేరుడు. మనకందరికీ సుపరిచితమైన ఎప్పుడూ ఎన్నో వస్తువులను కొనడానికి ఉపయోగించే ఇ కామర్స్ సంస్థ అమెజాన్ వ్యవస్థాపకుడు, ప్రస్తుత సీఈఓ. అమెజాన్ ను జెఫ్ బెజోస్ 1994 వ సంవత్సరంలో ఆన్లైన్ లో పుస్తకాలు అమ్మే సంస్థగా ప్రారంభించి తన కృషితో ఎన్నో ఆటుపోట్లను అధిగమించి పుస్తకాలనుంచి ప్రతి ఒక్క వస్తువు దొరికే ఆన్లైన్ సంస్థగా ప్రపంచ నలుమూలలకు విస్తరించి అతి నమ్మకమైనదిగాను అత్యధికమంది ఉపయోగించే ఆన్లైన్ సంస్థగా మార్చాడు. బెజోస్ సెప్టెంబర్ 2000 వ సంవత్సరంలో బ్లూ ఒరిజిన్ Blue Origin అనే పేరుతో మానవులను అంతరిక్షానికి తీసుకెళ్లే అంతరిక్ష ప్రయాణ సంస్థను స్థాపించాడు. అలాగే 2013 ఆగష్టు 5 న ది వాషింగ్టన్ పోస్ట్ The Washington Post అనే వార్తా పత్రికను 250 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసి తన వ్యాపార సామ్రాజ్యాన్నివిస్తరిస్తూ మొట్టమొదటి సారిగా 2017 జులై 27 న అప్పటివరకు ప్రపంచ ధనవంతులలో మొదటి స్థానంలో నిలిచిన బిల్ గేట్స్ ను వెనిక్కి నెట్టి అగ్ర స్థానంలో నిలిచాడు. ప్రస్తుతానికి 186 బిలియన్ డాలర్లు సుమారు రూ.13,88,862 కోట్లతో బ్లూమ్బర్గ్ ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచాడు.
బిల్ గేట్స్ అమెరికన్ సాఫ్టువేర్ డెవలపర్. బిల్ గేట్స్ తన చిన్ననాటి స్నేహితుడు పాల్ అల్లెన్ తో కలిసి ఏప్రిల్ 4 1975 న మైక్రోసాఫ్ట్ అనే కంప్యూటర్ సాఫ్టువేర్ తయారుచేసే కంపెనీని స్థాపించారు. మైక్రోసాఫ్ట్ కి సంబంధించిన విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినది. ఇప్పటికి ప్రపంచంలోనే అత్యధికమంది ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టంగా నిలిచింది. అలాగే బిల్ గేట్స్ అమెజాన్, ఆపిల్ ఇతర అనేక పెద్ద పెద్ద కంపెనీలలో పెట్టుబడులుకూడా పెట్టాడు. దీంతో బిల్ గేట్స్ దాదాపుగా 1995 వ సంవత్సరంనుంచి 2017 వరకు ప్రపంచ ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచాడు. బిల్ అండ్ మెలిందా గేట్స్ స్వచ్చంధ సంస్థద్వారా ప్రజలకు 60 మిలియన్ల డాలర్లతో సహాయం చేయడానికి 2020 మార్చి 23న మైక్రోసాఫ్ట్, బెర్కషైర్ హత్వె బోర్డులనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు కానీ పేదవాడిగా మరణిస్తే అది నీ తప్పే అవుతుంది అనే గొప్ప మాటలతో ప్రతి ఒక్క పేదవాడిని ఉత్సాహపరిచాడు. 2020 బ్లూమ్బర్గ్ సంస్థ ప్రకటించిన జాబితాలో బిల్ గేట్స్ 118 బిలియన్ డాలర్లతో అనగా సుమారు 8,81,106 కోట్ల రూపాయలతో రెండవ స్థానంలో నిలిచాడు.
ఈ 71 ఏళ్ల ఫ్రెంచ్ వ్యాపారవేత్త LVMH అనే లగ్జరి వస్తువులు తయారు చేసే సంస్థ కు సీఈఓ మరియు చైర్మన్ గా వ్యవహరిస్తున్నాడు. 1987 వ సంవత్సరంలో లూయిస్ విట్టన్ మరియు మోట్ హెన్నెస్ అనే రెండు సంస్థలు కలిసి LVMH గా ఏర్పడ్డాయి. ఈ కంపెనీలో దాదాపుగా వైన్స్, వాచెస్, జ్యువెలరీ, పర్ఫ్యూమ్స్ లాంటి వివిధ రకాల వస్తువులను తయారుచేసే 75 బ్రాండ్స్ దీనిక్రింద సబ్సిడరీలు వున్నాయి. అలాగే ప్రపంచంలోనే విలాసవంతమైన లగ్జరి వస్తువులను తయారుచేసే కంపెనీలలో మొదటి స్థానంలో ఉంటుంది. బెర్నార్డ్ అర్నాల్ట్ 1998 నుంచి 2001 సంవత్సరాల మధ్యలో Boo.Com, Libertysurf, Zebank అనే కంపెనీలతోపాటు 1999 వ సంవత్సరంలో Netflix అనే కంపెనీలోకూడా పెట్టుబడులు పెట్టాడు. 2007లో ఫ్రాన్స్ లోనే పెద్ద సూపర్ మార్కెట్ అయినా Carrefour అనే సంస్థలోకూడా Colony Capital అనే సంస్థతో కలిసి 10.69 శాతం వాటా కొన్నాడు. 2008 వ సంవత్సరంలో పడవల వ్యాపారంలోకి ప్రవేశించి 253 మిలియన్ యురోస్ కు ప్రిన్సెస్ పడవలు కొన్నాడు. దీంతో బెర్నార్ట్ అర్నాల్ట్ 2020 జులై లో బ్లూమ్బర్గ్ సంస్థ ప్రకటించిన ప్రపంచ ధనవంతుల జాబితాలో 95.1 బిలియన్ డాలర్లతో సుమారు 7,10,111.7 కోట్ల రూపాయలతో మూడవ స్థానంలో నిలిచాడు.
మార్క్ జుకర్బర్గ్ 2008 వ సంవత్సరంలో తన 23 వ ఏట బిలియన్ల డాలర్లు సంపాదించి బిలియనీర్ అయ్యి అప్పటికి అతి పిన్న వయసులో బిలియనీర్ అయ్యినవాడిగా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఫిబ్రవరి 4, 2004 వ సంవత్సరంలో జుకర్బర్గ్ తన రూంమేట్స్, హార్వర్డ్ విద్యార్థులయిన ఏడువార్డో సావేరిన్, ఆండ్రూ మెక్కల్లమ్, డస్టిన్ మాస్కోవిట్జ్, క్రిస్ హ్యూస్ అనే వారితో కలిసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సోషల్ మీడియా సంస్థ Facebook ను స్థాపించారు అలాగే ప్రస్తుతం చైర్మన్, సీఈఓగా వ్యవహరిస్తున్నాడు. ప్రపంచంలో Facebook సోషల్ మీడియా గురించి తెలియనివారు లేదా దానిని ఉపయోగించనివారు బహుశా మనకు వెతికినా కనపడకపోవచ్చు. అలాగే 2012 వ సంవత్సరంలోInstagram అనే ఫోటో, వీడియో షేర్ చేసే సోషల్ మీడియా సంస్థను 1 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసాడు. 2014 వ సంవత్సరంలో whatsapp అనే మొబైల్ మెసేజింగ్, వాయిస్ కాలింగ్, ఫోటో వీడియో షేరింగ్ సంస్థను 19 బిలియన్ డాలర్లను వెచ్చించి కొంన్నాడు. దీంతో బ్లూమ్బర్గ్ సంస్థ 2020 జులైలో ప్రపంచ ధనవంతుల జాబితాలో 91.8 బిలియన్ డాలర్లతో రూ.6,85,470.6 కోట్లతో నాల్గవ స్థానంలో నిలిచాడు.
ప్రపంచ ధనవంతుల టాప్ 10 జాబితాలో మన భారత దేశస్థుడైన ముఖేష్ అంబానీ ఉండడం మన దేశానికి ఎంతో గర్వకారణం. ధీరుభాయి అంబానీ సంపాదించి పెట్టిన ఆస్తిని కుమారులైన అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీకి ఆస్తి తగాదాతో పంపకాలు చేసినప్పుడు అనిల్ అంబానీ ఆస్తి రోజురోజుకి తరుగుతూరాగా ముఖేష్ అంబానీ తన తెలివితేటలతో తన వ్యాపారాన్ని విస్తరిస్తూ వచ్చాడు. ధీరుభాయి స్థాపించిన రిలయన్స్ ను తన మరణం తరువాత పంపకాలలో ముఖేష్ అంబానీకి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రాగా దానితో ఎన్నో అద్భుతాలు చేసి కొత్త రంగాలలోకి ప్రవేశిస్తూ తన కంపెనీలను లాభాలబాట పట్టిస్తూ వచ్చాడు. 2016 లో జియో రాకతో టెలికాం ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపేసిందనే చెప్పవచ్చు. అప్పటినుంచి మంత్లీ ప్లాన్లు రావడంతోపాటు ఇంటర్నెట్ చాలా చౌకగా మారింది. దీంతో ఇంటర్నెట్ వాడకం మన దేశంలో విపరీతంగా పెరిగింది. ఈవిధంగా తాను ప్రవేశించిన ప్రతీ రంగంలో ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యలా మారి మన దేశంలోనేకాక ప్రపంచ కుభేరుల జాబితాలో 74.3 బిలియన్ డాలర్లతో సుమారుగా 5,54,798.1 కోట్ల రూపాయలతో 6వ స్థానంలో నిలిచాడు.
1. జెఫ్ బెజోస్ 186 బిలియన్ డాలర్లు[సుమారు రూ.13,88,862 ]

2. బిల్ గేట్స్ 118 బిలియన్ డాలర్స్ [సుమారు 8,81,106 కోట్ల రూపాయిలు]
బిల్ గేట్స్ అమెరికన్ సాఫ్టువేర్ డెవలపర్. బిల్ గేట్స్ తన చిన్ననాటి స్నేహితుడు పాల్ అల్లెన్ తో కలిసి ఏప్రిల్ 4 1975 న మైక్రోసాఫ్ట్ అనే కంప్యూటర్ సాఫ్టువేర్ తయారుచేసే కంపెనీని స్థాపించారు. మైక్రోసాఫ్ట్ కి సంబంధించిన విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినది. ఇప్పటికి ప్రపంచంలోనే అత్యధికమంది ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టంగా నిలిచింది. అలాగే బిల్ గేట్స్ అమెజాన్, ఆపిల్ ఇతర అనేక పెద్ద పెద్ద కంపెనీలలో పెట్టుబడులుకూడా పెట్టాడు. దీంతో బిల్ గేట్స్ దాదాపుగా 1995 వ సంవత్సరంనుంచి 2017 వరకు ప్రపంచ ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచాడు. బిల్ అండ్ మెలిందా గేట్స్ స్వచ్చంధ సంస్థద్వారా ప్రజలకు 60 మిలియన్ల డాలర్లతో సహాయం చేయడానికి 2020 మార్చి 23న మైక్రోసాఫ్ట్, బెర్కషైర్ హత్వె బోర్డులనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు కానీ పేదవాడిగా మరణిస్తే అది నీ తప్పే అవుతుంది అనే గొప్ప మాటలతో ప్రతి ఒక్క పేదవాడిని ఉత్సాహపరిచాడు. 2020 బ్లూమ్బర్గ్ సంస్థ ప్రకటించిన జాబితాలో బిల్ గేట్స్ 118 బిలియన్ డాలర్లతో అనగా సుమారు 8,81,106 కోట్ల రూపాయలతో రెండవ స్థానంలో నిలిచాడు.
3. బెర్నార్డ్ అర్నాల్ట్ 95.1 బిలియన్ డాలర్స్ [సుమారు 7,10,111.7 కోట్ల రూపాయిలు]
ఈ 71 ఏళ్ల ఫ్రెంచ్ వ్యాపారవేత్త LVMH అనే లగ్జరి వస్తువులు తయారు చేసే సంస్థ కు సీఈఓ మరియు చైర్మన్ గా వ్యవహరిస్తున్నాడు. 1987 వ సంవత్సరంలో లూయిస్ విట్టన్ మరియు మోట్ హెన్నెస్ అనే రెండు సంస్థలు కలిసి LVMH గా ఏర్పడ్డాయి. ఈ కంపెనీలో దాదాపుగా వైన్స్, వాచెస్, జ్యువెలరీ, పర్ఫ్యూమ్స్ లాంటి వివిధ రకాల వస్తువులను తయారుచేసే 75 బ్రాండ్స్ దీనిక్రింద సబ్సిడరీలు వున్నాయి. అలాగే ప్రపంచంలోనే విలాసవంతమైన లగ్జరి వస్తువులను తయారుచేసే కంపెనీలలో మొదటి స్థానంలో ఉంటుంది. బెర్నార్డ్ అర్నాల్ట్ 1998 నుంచి 2001 సంవత్సరాల మధ్యలో Boo.Com, Libertysurf, Zebank అనే కంపెనీలతోపాటు 1999 వ సంవత్సరంలో Netflix అనే కంపెనీలోకూడా పెట్టుబడులు పెట్టాడు. 2007లో ఫ్రాన్స్ లోనే పెద్ద సూపర్ మార్కెట్ అయినా Carrefour అనే సంస్థలోకూడా Colony Capital అనే సంస్థతో కలిసి 10.69 శాతం వాటా కొన్నాడు. 2008 వ సంవత్సరంలో పడవల వ్యాపారంలోకి ప్రవేశించి 253 మిలియన్ యురోస్ కు ప్రిన్సెస్ పడవలు కొన్నాడు. దీంతో బెర్నార్ట్ అర్నాల్ట్ 2020 జులై లో బ్లూమ్బర్గ్ సంస్థ ప్రకటించిన ప్రపంచ ధనవంతుల జాబితాలో 95.1 బిలియన్ డాలర్లతో సుమారు 7,10,111.7 కోట్ల రూపాయలతో మూడవ స్థానంలో నిలిచాడు.
4. మార్క్ జుకర్బర్గ్ 91.8 బిలియన్ డాలర్స్ [సుమారుగా రూ.6,85,470.6 కోట్ల రూపాయిలు]
మార్క్ జుకర్బర్గ్ 2008 వ సంవత్సరంలో తన 23 వ ఏట బిలియన్ల డాలర్లు సంపాదించి బిలియనీర్ అయ్యి అప్పటికి అతి పిన్న వయసులో బిలియనీర్ అయ్యినవాడిగా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఫిబ్రవరి 4, 2004 వ సంవత్సరంలో జుకర్బర్గ్ తన రూంమేట్స్, హార్వర్డ్ విద్యార్థులయిన ఏడువార్డో సావేరిన్, ఆండ్రూ మెక్కల్లమ్, డస్టిన్ మాస్కోవిట్జ్, క్రిస్ హ్యూస్ అనే వారితో కలిసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సోషల్ మీడియా సంస్థ Facebook ను స్థాపించారు అలాగే ప్రస్తుతం చైర్మన్, సీఈఓగా వ్యవహరిస్తున్నాడు. ప్రపంచంలో Facebook సోషల్ మీడియా గురించి తెలియనివారు లేదా దానిని ఉపయోగించనివారు బహుశా మనకు వెతికినా కనపడకపోవచ్చు. అలాగే 2012 వ సంవత్సరంలోInstagram అనే ఫోటో, వీడియో షేర్ చేసే సోషల్ మీడియా సంస్థను 1 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసాడు. 2014 వ సంవత్సరంలో whatsapp అనే మొబైల్ మెసేజింగ్, వాయిస్ కాలింగ్, ఫోటో వీడియో షేరింగ్ సంస్థను 19 బిలియన్ డాలర్లను వెచ్చించి కొంన్నాడు. దీంతో బ్లూమ్బర్గ్ సంస్థ 2020 జులైలో ప్రపంచ ధనవంతుల జాబితాలో 91.8 బిలియన్ డాలర్లతో రూ.6,85,470.6 కోట్లతో నాల్గవ స్థానంలో నిలిచాడు.
5. స్టీవ్ బాల్మెర్ 75.1 బిలియన్ డాలర్లు[సుమారుగా 5,60,771.7 కోట్ల రూపాయిలు]
CNBC.com
స్టీవ్ బాల్మెర్ అమెరికాకు చెందిన వ్యాపారవేత్త, ఇన్వెస్టర్. బిల్ గేట్స్ ద్వారా 1980 జూన్ 11 న మైక్రోసాఫ్ట్ సంస్థలో నియమింపబడిన మొదటి బిజినెస్ మేనేజర్ గానున మైక్రోసాఫ్ట్ 30 వ ఉద్యోగస్థుడుగాను ప్రవేశించాడు. బాల్మెర్ కు 50,000 డాలర్ల జీతం 5-10 శాతం వాటాను ఇచ్చారు. 2003లో బాల్మెర్ 39.3 మిలియన్ మైక్రోసాఫ్ట్ షేర్లను సుమారు 955 మిలియన్ డాలర్లకు అమ్మడంతో తన వాటాను 4 శాతానికి తగ్గించుకున్నాడు. అప్పటికి అంచలంచెలుగా ఎదుగుతూ 20 సంవత్సరాలు అనేక కార్యకలాపాలు నిర్వహించి బిల్ గేట్స్ తరువాత 2000వ సంవత్సరాన మైక్రోసాఫ్ట్ కు సీఈఓ గా బాధ్యతలు స్వీకరించి ఎన్నో సేవలు చేసి 2014 న వైదొలిగాడు. 2014 ఆగష్టు 12 న NBA యొక్క లాస్ ఏంజిల్స్ క్లిప్పర్స్ అనే జట్టును 2బిలియన్ డాలర్లకు వేలంలో కొనుగోలు చేసాడు. ఈ విధంగా 75.1 బిలియన్ డాలర్లతో సుమారుగా 5,60,771.7 కోట్ల రూపాయిలతో ఐదవ స్థానంలో నిలిచాడు.6. ముఖేష్ అంబానీ 74.3 బిలియన్ డాలర్లు[సుమారుగా 5,54,798.1 కోట్ల రూపాయిలు]
forbes.com
ప్రపంచ ధనవంతుల టాప్ 10 జాబితాలో మన భారత దేశస్థుడైన ముఖేష్ అంబానీ ఉండడం మన దేశానికి ఎంతో గర్వకారణం. ధీరుభాయి అంబానీ సంపాదించి పెట్టిన ఆస్తిని కుమారులైన అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీకి ఆస్తి తగాదాతో పంపకాలు చేసినప్పుడు అనిల్ అంబానీ ఆస్తి రోజురోజుకి తరుగుతూరాగా ముఖేష్ అంబానీ తన తెలివితేటలతో తన వ్యాపారాన్ని విస్తరిస్తూ వచ్చాడు. ధీరుభాయి స్థాపించిన రిలయన్స్ ను తన మరణం తరువాత పంపకాలలో ముఖేష్ అంబానీకి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రాగా దానితో ఎన్నో అద్భుతాలు చేసి కొత్త రంగాలలోకి ప్రవేశిస్తూ తన కంపెనీలను లాభాలబాట పట్టిస్తూ వచ్చాడు. 2016 లో జియో రాకతో టెలికాం ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపేసిందనే చెప్పవచ్చు. అప్పటినుంచి మంత్లీ ప్లాన్లు రావడంతోపాటు ఇంటర్నెట్ చాలా చౌకగా మారింది. దీంతో ఇంటర్నెట్ వాడకం మన దేశంలో విపరీతంగా పెరిగింది. ఈవిధంగా తాను ప్రవేశించిన ప్రతీ రంగంలో ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యలా మారి మన దేశంలోనేకాక ప్రపంచ కుభేరుల జాబితాలో 74.3 బిలియన్ డాలర్లతో సుమారుగా 5,54,798.1 కోట్ల రూపాయలతో 6వ స్థానంలో నిలిచాడు.
7. లారీ పేజ్ 73.5 బిలియన్ డాలర్లు[సుమారుగా 5,48,824.5 కోట్ల రూపాయిలు ]
cnbc.com
లారీ పేజ్ అమెరికన్ కంప్యూటర్ సైంటిస్ట్. మనమందరము ఎప్పుడు సమాచారంకోసం ఉపయోగించే గూగుల్ అనే సెర్చ్ ఇంజిన్ ను 1998 వ సంవత్సరం సెప్టెంబర్లో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో Ph.D చదువుతున్నప్పుడు తన క్లాసుమేట్ సెర్గెయ్ బ్రిన్ తో కలిసి ప్రారంభించారు. ఇప్పుడు గూగుల్ ప్రపంచంలోనే ఎక్కువమంది ఉపయోగించే సెర్చ్ ఇంజిన్ సంస్థ. పేజ్ గూగుల్ కు 2001 వరకు సీఈఓ గా పని చేసాడు. గూగుల్ లో పెట్టుబడి పెట్టడానికి వచ్చిన Kleiner PerkinsCaufield Byers , Sequoia Capital సంస్థలు 50 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడానికి సిద్దపడి అనుభవస్తులు సీఈఓ గా ఉంటే మంచిదనే ఉద్దేశ్యంతో పేజ్ ను సీఈఓ నుంచి దిగిపొమ్మని ఒత్తిడి చేయడంతో దానిని పేజ్ అంగీకరించాడు.2004 లో ఐపిఒ లో గూగుల్ లిస్ట్ అయ్యింది. 2005 వ సంవత్సరంలో 50 మిలియన్ డాలర్లకు ఆండ్రాయిడ్ కొనుగోలు చేసాడు ఇప్పుడు మొబైల్ ఫోన్లలో ఎక్కువగా ఉపయోగించే సాఫ్ట్వేర్ గా ఆండ్రాయిడ్ నిలిచింది. అలాగే 2006 లో యూట్యూబ్ అనే వీడియో షేరింగ్ కంపెనీని గూగుల్ కొనుగోలు చేసింది. ప్రస్తుతం 73.5 బిలియన్ డాలర్ల ఆస్తితో సుమారుగా 5,48,824.5 కోట్ల రూపాయలతో 7 వ స్థానంలో నిలిచాడు. 8. వారెన్ బఫెట్ 72.7 బిలియన్ డాలర్లు[ సుమారుగా 5,42,850.9 కోట్ల రూపాయిలు]
USATODAY.com
వారెన్ బఫెట్ వార్తా పత్రికలు, కోక్ బాటిల్స్ అమ్ముకునే స్థాయినుంచి ప్రపంచ గొప్ప ఇన్వెస్టరుగాను ధనవంతుడుగాను మారినతీరు ఎంతో అమోఘమని చెప్పవచ్చు. ఆడుతూ పాడుతూ తిరిగే 14 ఏళ్ల వయసులోనే షేర్ మార్కెట్లో కంపెనీలలో పెట్టుబడులు పెట్టి ఆదాయ పన్ను కూడా కట్టడం ఆశ్చర్యకరం. 1962వ సంవత్సరంలో అప్పటికే నష్టాల్లో ఉన్న బెర్కషైర్ హాత్వె అనే వస్త్రాలకు సంబంధించిన Textile కంపెనీలో భారీగా షేర్లు కొనుగోలు చేసాడు. 1970 నుంచి ఇప్పటికికూడా ఆయన బెర్కషైర్ హాత్వేకు సీఈఓ గా వ్యవహరిస్తున్నాడు. ఇతడికి అమెజాన్, ఆపిల్, కోకో కోలా, అమెరికన్ ఎక్సప్రెస్ లాంటి అనేక పెద్ద పెద్ద కంపెనీలలో వాటాలు వున్నాయి. ఒకానొక సమయంలో ఇతడు పెట్టుబడి పెట్టే ప్రతి కంపెనీ లాభాలతో దూసుకెళ్లుతుండడంతో ఎంతోమంది ఇన్వెస్టర్లు బఫెట్ ఎక్కడ పెట్టుబడి పెడితే అక్కడ గ్రుడ్డిగా పెట్టేవారు. ఇతడు మొట్టమొదటిసారి 2008 వ సంవత్సరంలో అప్పటికి వరుసగా 13 సంవత్సరాలుగా ధనవంతుడిగా ఉన్న బిల్ గేట్స్ ని దాటి 62 బిలియన్ డాలర్లతో మొదటి స్థానానికి చేరుకున్నాడు. ఇప్పుడు 72.7 బిలియన్ డాలర్లతో 5,42,850.9 కోట్ల రూపాయలతో ఎనిమిదవ స్థానంలో నిలిచాడు. 9. ఎలోన్ ఆర్. మస్క్ 71.5 బిలియన్ డాలర్లు[ సుమారుగా 5,33,890 కోట్ల రూపాయిలు ]
Bloomberg.com
ఎలోన్ మస్క్ సౌత్ ఆఫ్రికాలో పుట్టి ప్రపంచాన్నే మార్చేయగలిగేంతగా ఎదిగిన వ్యాపారవేత్త. భయం అనేమాట లేకుండా గొప్ప ఆలోచనలతో శక్తివంతమైన నిర్ణయాలు తీసుకుంటూ ఐరన్ మాన్ గా పిలవబడ్డాడు. ఎలోన్ మస్క్ ఎంతో దూరంగా ఆలోచించే వ్యక్తి. టెస్లా అనే కార్ల కంపెనీకి 2008 నుంచి ఇప్పటికి సీఈఓ గా వ్యవహరిస్తున్నాడు ఇతడికి ఇందులో 20.8 శాతం షేర్లు తన పేరిట వున్నాయి. Space X అనే మానవులను అంతరిక్షానికి తీసుకుళ్ళే సంస్థను 2002లో ఎలోన్ మస్క్ ప్రారంభించాడు. ఇందులో రాకెట్లను తయారుచేసి మానవులను అంగారక గ్రహానికి తీసుకెళ్లాలనేది అతని ఆశ. అలాగే 2006 లో SolarCity అనే కంపెనీని తన సహోదరులతో కలిసి సోలార్ ప్యానెల్స్ తయారుచేయడానికి ప్రారంభించాడు. High Speed Transportation కొరకు hyperloop అనే కంపెనీనీకూడా 2013 లో ప్రారంభించాడు. ఈ విధంగా అనేక కంపెనీలను స్థాపించి ప్రపంచ కుభేరులలో 71.5 బిలియన్ డాలర్లతో 5,33,890 కోట్ల రూపాయిలతో 9 వ స్థానములో నిలిచాడు.
ధన్యవాదాలు
మీ అభిప్రాయాలు కామెంట్ల రూపంలో తెలియజేయగలరు.
10. సెర్గెయ్ బ్రిన్ 71.2 బిలియన్ డాలర్లు [సుమారుగా 5,31,650.4 కోట్ల రూపాయిలు]
inc.com
సెర్గెయ్ బ్రిన్ అమెరికన్ కంప్యూటర్ శాస్త్రవేత్త. 1998 వ సంవత్సరంలో తన స్నేహితుడైన లారి పేజ్ తో కలిసి గూగుల్ కంపెనీని స్థాపించాడు. ఇది ప్రపంచంలో అత్యధికమంది ఉపయోగించే సెర్చ్ ఇంజిన్ గా నిలిచింది. లారీ పేజ్ తో కలిసి Page Rank Algorithm అనే దానిని అభివృద్ధి చేసారు. ఇది ఎవరి సమాచారం అయితే ఎక్కువ మంది చూస్తారో లేక ఏ Website కి ఎక్కువ Backlinks వుంటాయో వాటిని మొదటి పేజీ లో చూపిస్తాయి. ఈ విధంగా ప్రపంచంలో ఒక క్రొత్తదానికి నాంది పలికాడు. సెర్గెయ్ బ్రిన్ టెస్లా అనే ఎలోన్ మస్క్ కార్ల కంపెనీలో పెట్టుబడి పెట్టాడు. జులై 22 కి గాను 71.2 బిలియన్ డాలర్లతో సుమారుగా 5,31,650.4 కోట్ల రూపాయలతో 10 వ స్థానంలో నిలిచాడు. ధన్యవాదాలు
మీ అభిప్రాయాలు కామెంట్ల రూపంలో తెలియజేయగలరు.
Post a Comment
0 Comments